త్రిబుజాకారపు స్వీట్స్ (Triangular Sweet Preparation in Telugu)

వంటపేరు : త్రిబుజాకారపు  స్వీట్స్ 

కావలసిన పదార్ధాలు :

బియ్యపు పిండి : రెండు కప్పులు 
బెల్లం లేదా పంచదార : కప్పున్నర 
ఉప్పు : సరిపడా
యాలుకల పొడి : అర టీ స్పూన్ 
జీడి పప్పు : పది 
బాదం : ఆరు 
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు 
నూనె : వేయించటానికి సరిపడా 

తయారుచేయు విధానం :

1) బియ్యపు పిండిలో నాలుగు గ్లాసుల నీళ్ళుపోసి, ఉప్పు కలిపి స్టవ్ మీద కలుపుతూ ఉడకబెట్టాలి. 
2) బాగా గట్టిపడ్డాక ప్లేటుకు నెయ్యిరాసి ఉ డికిన పిండిని ప్లేట్లో సమంగా చెయ్యాలి.
3) బాగా చల్లారిన తరువాత త్రిబుజా కారంలో ముక్కలుగా కట్ చెయ్యాలి.
4) స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి,  నూనె కాగాక కట్ చేసిన త్రిబుజా కారం ముక్కలు వేసి దోరగా వేయించి ప్లేటులోకి తియ్యాలి.
5) ఇప్పుడు బెల్లం ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి. 
6) పాకం రాగానే దీనిలో యాలుకలపొడి, నెయ్యి, వేయించిన త్రిబుజాలు వేసి కలిపాలి. వీటి ఫై నేతిలో వేపిన  జీడిపప్పులు, బాదంలు వెయ్యాలి.


అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ రెడీ.