చికెన్ మసాల కర్రీ (Chicken masala curry in telugu)

కావలసిన పదార్దములు :


చికెన్ : అరకిలో
ఎండిమిర్చి : ఆరు
ధనియాలు : 1 టేబుల్ స్పూన్
జీలకర్ర : 1 టీ స్పూన్
గసాలు : 1 టేబుల్ స్పూన్
లవంగాలు : మూడు
దాల్చిన చెక్క : చిన్న ముక్క
యాలుకలు : మూడు
ఉల్లి ముక్కలు : చిన్న కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు : 1 టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
టమాట ప్యూరి : 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి పొడి : 2 టేబుల్ స్పూన్లు 


తయారుచేయు విధానం :


1) చికెన్ శుభ్రంగా కడిగి నీళ్ళువంచి పక్కనపెట్టాలి.
2) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. పాన్ వేడవగానే దానిలో  ధనియాలు, జీలకర్ర, ఎండిమిర్చి, గసగసాలు, కొబ్బరి పొడి, చెక్క, లవంగాలు, యాలుకలు వేసి వేయించుకోవాలి. ఇవి చల్లారిన తరువాత మిక్సిలో వేసి పొడి చేసుకోవాలి.
3) ఇవి మెత్తగా అయ్యిన తరువాత ఉల్లి ముక్కలు, టమాట ప్యూరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి మళ్ళి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన మసాల  రెడీ అవ్వుతుంది. 
4) ఇప్పుడు ఈ మషాళాని చికెన్ కు పట్టించి ఒక అర గంట పక్కన పెట్టాలి.
5) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వేడి అయ్యిన తరువాత మషాళా పట్టించిన చికెన్ వేసి కలుపుతూ ఉడకనివ్వాలి.
6) అలా మధ్యమధ్యలో కలుపుతూ చికెన్లో ఊరిన నీరు మొత్తం యిగిరి పోయేవరకు ఉడకనివ్వాలి.
కాసేపటికి చికెన్ ఉడికి పొడిపొడిగా ఆవ్వుతుంది. స్టవ్ ఆపి తయారయ్యిన మషాళా చికెన్ ని ఒక ప్లేటులోకి తీసుకోని కొత్తిమీర జల్లి సర్వ్ చెయ్యాలి.

* అంతే ఎంతో రుచిగా ఉండే మషాల చికెన్ కర్రీ రెడీ.
* దీనికి నూనె అవసరం లేదు, చికెన్ లో ఉండే ఆయిల్ సరిపోతుంది.