మొక్కజోన్నగింజలతో రైస్ (Sweetcorn Rice in telugu Mokkajonna Rice)

మొక్కజోన్నగింజలతో రైస్ 


కావలసిన పదార్దములు :


మొక్కజోన్నగింజలు (స్వీట్ కార్న్) : అర కప్పు 
బాస్మతి బియ్యం : కప్పు 
కొబ్బరిపాలు : రెండు కప్పులు 
ఉప్పు : సరిపడా 


తయారుచేయు విధానం :


1) బియ్యం కడిగి కొబ్బరి పాలలో అరగంట నానబెట్టాలి.
2) తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేడిచేసి స్వీట్ కార్న్ కాసేపు వేయించాలి. 
3) వేగగానే కొబ్బరి పాలతో సహా బియ్యం వేసి అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలిపి మూతపెట్టి పది నిముషాలు వుడకనివ్వాలి. 
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు వేసి కలిపి, అన్నం ఉడికెవరకు వుంచి స్టవ్ ఆపాలి.


* అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెడీ.
(ఉప్పు బదులు పంచదార లేదా బెల్లం వేసుకోవచ్చు)