కోవా కొబ్బరి లడ్డు (Coconut Cova Laddu in telugu Kobbari Kova Laddoolu)

వంటపేరు : కోవా కొబ్బరి లడ్డు

కావలసిన పదార్దములు :

కొబ్బరిపాలు : పావులీటరు 
కోవా : అరకేజీ 
పంచదార : రెండు టేబుల్ స్పూన్లు 
యలుకలపొడి : అర టీ స్పూన్ 
బియ్యపు పిండి : రెండు టీ స్పూన్లు 
గసాలు, నువ్వులు : వేయించినవి వంద గ్రాములు 
ఖర్జూరాలు : పావుకిలో 

తయారుచేయు విధానం :

1) కొబ్బరి పాలల్లో  బియ్యపు పిండి కలిపి స్టవ్ ఫై పెట్టి మరిగించాలి .
2) అలా మరిగిన పాలల్లో కోవాను వేసి కలుపుతూ కసేపు ఆగి పంచదార, 
   యాలుకల పొడి వేసి వుడికించాలి.
3) కొబ్బరి పాలు, కోవా, పంచదార వేసి కలుపుతూ ఉ డికిస్తే కాసేపటికి 
   గట్టిపడుతుంది.
4) దీనిని అరగంట ప్రిజ్ లో వుంచాలి.
5) ఫ్రిజ్ నుండి తీసిన కోవా మిశ్రమం కొద్దిగా చేతిలోకి తీసుకోని, గింజలు 
   తీసిన ఖర్జ్జురాలు కోవా మధ్యలో రెండు చొప్పున పెట్టి చిన్నచిన్న 
   ఉండలుగా చుట్టి ప్లేటులో పెట్టుకోవాలి.

* అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి కోవా ఉండలు రెడీ.