వెజిటబుల్ పకోడీ (Vegetable Pakoda in telugu Kooragayala Pakodi)

వంటపేరు : వెజిటబుల్ పకోడీ


కావలసిన పదార్దములు :


శెనగ పప్పు : అర కప్పు 
పెసర పప్పు : అర కప్పు 
బియ్యం : పావు కప్పు 
పాలకూర తరుగు : 2 టేబుల్ స్పూన్లు 
తోట కూర తరుగు : 2 టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర తరుగు : రెండు టేబుల్ స్పూన్లు 
కేబేజీ తరుగు : రెండు టేబుల్ స్పూన్లు 
చిన్నగా కట్ చేసిన కాలీ ప్లవర్ : రెండు టేబుల్ స్పూన్లు 
ఉల్లి ముక్కలు : అర కప్పు 
పచ్చిమిర్చి పేస్టు : టేబుల్ స్పూన్ 
అల్లం రసం : టేబుల్ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
నూనె : వేయించటానికి సరిపడా 


తయారుచేయు విధానం :
  • శెనగ పప్పు, పెసర పప్పు, బియ్యం మూడు గంటలు ముందు నానబెట్టి మెత్తగా రుబ్బాలి.
  • రుబ్బిన పిండిలో ఫైన చెప్పిన వెజటబుల్స్ అన్నీ కలిపి ముద్దలా చెయ్యాలి.
  • స్టవ్ వెలిగించి  నూనె వేడి చెయ్యాలి .
  •  కాగిన తరువాత పిండిని పకోడిలా వేసి దోరగా వేపుకోవాలి.
  • అంతే  వేడి వేడి వెజిటబుల్ పకోడీ రెడీ.