పచ్చిమామిడితో జామ్ (Green Mango Jam in telugu Pachchi Mamidi Jam)

పచ్చిమామిడితో జామ్


కావలసిన పదార్దములు :


పచ్చి మామిడి ముక్కలు : కప్పు 
పంచదార : రెండు కప్పులు 




తయారుచేయు విధానం :


1) మామిడి కాయలు చెక్కు తీసి ముక్కలుగా కట్  చెయ్యాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొద్దిగా నీళ్లుపొయ్యాలి.
3) దీనిలొ వేరే గిన్నె పెట్టి మామిడి ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళుపోసి మూత పెట్టి ఐదు నిముషాలు ఉ డకనివ్వాలి.
4) ఇప్పుడు వేరే కళాయి స్టవ్ మీద పెట్టి పంచదార పాకం పట్టాలి. తీగపాకం రాగానే ఉడికిన మామిడి ముక్కలు మెత్తగా చేసి పాకంలో వేసి తిప్పాలి.
5) చిక్కబడిన తరువాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారితే గట్టి పడుతుంది.


* ఇది చపాతీ, దోశ, బ్రెడ్ లోకి చాలా బాగుంటుంది.