కలాకంద్ కజ్జికాయలు (Kalakand Kajjikayalu)

కలాకంద్ కజ్జికాయలు


కావలసిన పదార్ధాలు :


మైదా : పావుకిలో
కలాకండ్ : పావుకిలో
పంచదార పొడి : కప్పు
జీడిపప్పులు, బాదం : 1 కప్పు
నూనె : అరకిలో
యాలుకలపొడి : టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) మైదా, ఉప్పు, రవ్వ, నెయ్యి వేసి కలిపి నీళ్లుపోసి ముద్దగా చేసి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు ఒక గిన్నెలో కలాకండ్ వేసి దానిలో చిన్నగా కట్ చేసిన బాదం, జీడిపప్పులు, పంచదార పొడి కలపాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగేలోపు మైదా ముద్దని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిలా చేసి  దానిలో కలాకండ్ మిశ్రమం పెట్టి కజ్జికాయలు చేసే చెక్కలో పెట్టి నొక్కితే  కజ్జికాయ ఆకారంలో వస్తుంది.


ఇలా అన్ని చేసి కాగే నూనెలో వేసి దోరగా వేగనిచ్చి తియ్యటమే.


* అంతే కలాకండ్ కజ్జికాయలు రెడి .