కొబ్బరి సమోసా (Coconut Samosa in telugu Kobbari Samosa)

వంటపేరు : కొబ్బరి సమోసా


కావలసిన పదార్దములు :


జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు (చిన్నగా కట్ చేసినవి) : 1 కప్పు
కొబ్బరి కాయ : ఒకటి
పంచదార : మూడు  కప్పులు
మిల్క్ మెయిడ్ : 1 కప్పు
యాలుకలపొడి : టీ స్పూన్
మైదా : పావు కిలో
నెయ్యి : కప్పు
నూనె : పావుకిలో


తయారు చేయు విధానం :


1) మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు కొబ్బరి కోరుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి.
3) పాకంలో కొబ్బరికోరు వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకలపొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి. 
4) ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి  దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి.
5) అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి.
6) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారు చేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తియ్యాలి.
7) ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసి ప్లేటులో పెట్టాలి.


* అంతే కొబ్బరి స్వీట్ సమోసా రెడి.