జొన్న దోశలు (Corn Dosa in telugu Jonna Dosalu)

వంటపేరు : జొన్న దోశలు

కావలసిన పదార్దాలు :


శుబ్రం చేసిన జొన్నలు : రెండు కప్పులు 
మినపప్పు : కప్పున్నర 
బియ్యం : అరకప్పు 
వంటసోడా : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా 
నూనె : అరకప్పు 
అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు : కప్పు 
జీలకర్ర : టీ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) ఆరు గంటలు ముందు  జొన్నలు, మినపప్పు, బియ్యం విడివిడిగా 
    నానబెట్టాలి.
2) తరువాత నీళ్ళు వంపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో ఉప్పు కలిపి 
    రాత్రంతా పక్కనపెట్టాలి.
3) ఉదయానికి ఈ పిండి పులుస్తుంది. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసి పిండిని 
    పలుచగా కలుపుకోవాలి.
4) ఇప్పుడు పిండిలో వంటసోడా కలపాలి.
5) స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం పిండి గరిటతో తీసి పాన్ మీద దోశలా వేసి ఫైన 
    జీలకర్ర, ఉల్లి, మిర్చి,అల్లం ముక్కలు జల్లాలి. ఇవి లేకుండా ప్లెయిన్ కూడా 
    దోశ వేసుకోవచ్చు. దోశ చుట్టూ నూనె వేసి రెండు ప్రక్కలా దోరగా కాల్చాలి.


* అంతే ఎంతో రుచిగా ఉండే జోన్నదోశలు రెడీ.