వంటపేరు : బాదుషా
కావలసిన పదార్దములు :
మైదా - అర కేజీ
నెయ్యి - వందగ్రాములు
పంచదార - ముప్పావు కేజీ
యాలుకల పొడి - టీ స్పూన్
వంటసోడ- అర టీ స్పూన్
పెరుగు - వంద గ్రాములు
తయారుచేయు విధానం :
1)మైదాజల్లించి దానిలో వంటసోడ ,కరిగించిన నెయ్యి వేసి బాగా కలిపి పెరుగు వేసి కలపాలి .(,అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి కలపొచ్చు)ముద్దలా కలిపి అర గంట పక్కన పెట్టాలి.
2)స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి .
3)నూనె కాగేలోపు కలిపిన పిండిని రెండు చేతులతో బాగా కలపాలి .
4)ఇప్పుడు చిన్నచిన్న ఉండలుగా చేసి ఒక్కో ఉండను రెండు చేతుల మద్యన చిన్నగా నొక్కి బొటనవేళ్ళతోఉండ మద్యన రెండు ప్రక్కలా చిన్నగా నొక్కి కాగే నూనెలో వేసి చిన్న మంట మీద రెండు ప్రక్కలా దోరగా వేయింఛి ప్లేటులోకి తియ్యాలి .
5)ఇప్పుడు పంచదారలో కొద్దిగా నీళ్ళుపోసి పాకం పట్టాలి .తీగపాకం వచ్చాక యాలుకలపొడి కలిపి స్టవ్ ఆపాలి.
6)ఇప్పుడు వేయించిన బాదుషాలు పాకంలో వేసి బాగా కలిపి పది నిముషాలు పక్కన పెట్టాలి.
అలాచేస్తే బాదుషాలు పాకం పీల్చుకుంటాయి.వీటిని వేరే ప్లేటులోకి తీసుకుంటే బాదుషాలు తినటానికి రెడీ .

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te