కర్జూరం (డేట్స్) ఖీర్ (Dates Kheer in telugu Kharzooram Kheer)

కర్జూరం (డేట్స్) ఖీర్


కావలసిన పదార్ధాలు : 


పాలు : కప్పు
కొబ్బరి పాలు : కప్పు
డేట్స్ : కప్పు 
బెల్లం : అర కప్పు
జీడిపప్పులు : పది
బాదం పప్పులు : పది  
యాలకలపొడి : అర టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడిచేసి జీడిపప్పులు దోరగా వేపి తియ్యాలి.
2) ఇప్పుడు అదే కళాయిలో పాలు పోసి గరిటతో కలుపుతూ మరగబెట్టాలి.
3) పాలు మరుగుతుండగా కొబ్బరిపాలు వేసి  డేట్స్ లోని గింజలు తీసి చిన్నచ్చిన్న ముక్కలుగా కట్ చేసి కాగుతున్న పాలల్లో వేసి కాసేపు కలుపుతూ ఉండాలి.
4) ఇప్పుడు బెల్లం కలిపి రెండు నిముషాలు ఆగి జీడిపప్పులు, చిన్నగా కట్ చేసిన  బాదం, యాలుకలపొడి వేసి స్టవ్ ఆపాలి. (బెల్లం బదులు పంచదార వేసుకోవచ్చు)


* అంతే డేట్స్ ఖీర్ రెడీ.