మామిడి బర్ఫీ (Mango Burfi in telugu Mamidi Burfi)

వంటపేరు : మామిడి బర్ఫీ


కావలసిన పదార్ధాలు :


మామిడి పళ్ళు : ఆరు
పాలు : రెండు కప్పులు
పంచదార : కప్పు
కొబ్బరి తురుము : కప్పు
జీడిపప్పులు, బాదం, పిస్తా : అర కప్పు 
నెయ్యి : పావుకప్పు 

తయారుచేయు విధానం :



1)  మామిడి పళ్ళు చెక్కు తీసి ముక్కలుగా చేసి మెత్తగా చిదిమి పక్కన పెట్టాలి.
2) పాలల్లో పంచదార వేసి స్టవ్ మీదపెట్టి చిన్నమంట మీద మరిగించాలి. పాలు పావు వంతు మిగిలేలా మరిగించాలి.
3) ఇప్పుడు మామిడి గుజ్జు, కొబ్బరి తురుము వేసి కలుపుతూ చిన్న మంటమీద ఉడికించాలి.
4) ఈ మిశ్రమం గట్టి పడుతుండగా నేతిలో వేపిన జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు వేసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపాలి.
5) ఒక ప్లేటుకు నెయ్యి రాసి గట్టిపడిన ఈ మిశ్రమం వేసి సమంగా సర్దాలి.
జీడిపప్పులు, బాదం పప్పులు వేసి అద్దాలి.


* చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చెయ్యటమే.