పెరుగు ఆవడ (Perugu Aawada Preparation in Telugu)

వంటపేరు : పెరుగు ఆవడ 


కావలసిన పదార్దములు :


పెరుగు : లీటరు 
(లీటరు పాలు తోడుపెట్టాలి )
మినపప్పు : అరకేజీ 
ఉప్పు : సరిపడా 
నూనె : అర కేజీ 
పోపుదినుసులు : టీ స్పూన్ 
ఎండిమిర్చి : రెండు 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పసుపు : చిటికెడు 
వంటసోడా : చిటికెడు 


తయారుచేయు విధానం :


1) మినపప్పును నాలుగు గంటలు ముందు నానబెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి పోపుదినుసులు వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దించి  పెరుగులో వెయ్యాలి. ఆవడలు వెయ్యటానికి తాలింపు పెరుగు రెడి.
3) ఇప్పుడు నానిన పప్పును శుబ్రంగా కడిగి మెత్తగా గట్టిగా రుబ్బాలి. దీనిలో ఉప్పు, సోడా కలపాలి.
4) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
5) నూనె కాగిన తరువాత రుబ్బిన పిండిని గారెలు లాగా ఒత్తి నూనెలో దోరగా వేయించి తీసి, పోపువేసిన పెరుగులో అరగంట పక్కన పెట్టాలి.
6) అలా చేస్తే గారెలు పెరుగును పీల్చుకుంటాయి.


* ఇప్పుడు ఆవడలు తినటానికి రెడి.