ఖర్జూర హల్వ (Dates Halwa in telugu Kharzoorapu Halwa)

ఖర్జూర హల్వ 

కావలసిన పదార్ధాలు :

తాజా ఖర్జూరాలు : అరకిలో 
పాలు : ఒకటిన్నర లీటరు
శెనగపప్పు : పావుకిలో 
నెయ్యి : కప్పు 
యాలుకల పొడి : 1 టీ స్పూన్ 
జీడిపప్పు : పది 
బాదం పప్పులు : పది 
పిస్తా : పది 

తయారుచేయు విధానం :

1) బాదం, పిస్తా పావుగంట నీటిలో నానబెట్టాలి. నానిన తరువాత చిన్నముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచాలి. ఖర్జ్జురాలు  గింజలు తీసి మెత్తగా చెయ్యాలి.
2) సెనగపప్పును రెండు గంటలు ముందు నానబెట్టుకొని నీళ్ళు వంచి, పాలు కలపాలి. పప్పు మెత్తగా అయ్యి,  పాలు ఇగిరిపోయే వరకు మెత్తగా ఉడకబెట్టాలి.
3) చల్లారిన తరువాత పప్పును మిక్సిలో వేసి మెత్తగా చెయ్యాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణిలో నెయ్యి వేసి, వేడయ్యాక  ఖర్జ్జురం పేస్టూ, శెనగపప్పు ముద్ద వేసి బాగా వేయించాలి.
5) ఇప్పుడు పంచదార వేసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇది గట్టిపడుతుండగా యాలుకులపొడి వేసి కలిపి స్టవ్ ఆపాలి.
6) తరువాత ప్లేటుకు నెయ్యి రాసి దానిలోకి ఈమిశ్రమం వేసి సమంగా సర్ది, దానిమీద జీడిపప్పులు, పిస్తా, బాదం పప్పులు వేసి అలంకరిస్తే సరి.