సెనగపప్పు కొబ్బరి కూర (Senagapappu kobbari / coconut dal curry)

వంటపేరు : సెనగపప్పు కొబ్బరి కూర
                                                  
కావలసిన పదార్దములు :

సెనగ పప్పు : పావుకేజీ 
తాజాకొబ్బరి  : మూడు టేబుల్ స్పూన్లు 
పుట్నాల పొడి : రెండు టీ స్పూన్లు 
పోపుదినుసులు : కొద్దిగా 
ఎండుమిర్చి : రెండు 
కరివేపాకు : కొద్దిగా 
ఉప్పు : తగినంత
కారం : పావుటీ స్పూన్ 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయ : ఒకటి 
పచ్చిమిర్చి : రెండు 
పసుపు : చిటికెడు 

తయారుచేయు విధానం :

1) సెనగపప్పును వుడకబెట్టి నీళ్ళు వంపి, పక్కన వుంచాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడిచేయ్యాలి.
3) నూనె కాగాక పోపుదినుసులు వేసి వేగాక, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 
    వేగాక, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
4) ఇప్పుడు శెనగపప్పు వేసి కాసేపు కలిపి, కారం, పసుపు, ఉప్పు వేసి 
    కలపాలి. ఒక నిమిషం వేగాక పచ్చికొబ్బరి తురుము, పుట్నాల పొడి వేసి 
    కలిపితే కూర పొడిపొడిగా అవుతుంది.
5) ఇప్పుడు స్టవ్ ఆపి కొత్తిమిర జల్ల్లాలి.


* అంతే కొబ్బరి శెనగపప్పు కూర రెడి.
  (కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు)