నువ్వుల ఉండలు (Nuvvula Undalu / Seasame Laddu)

వంటపేరు : నువ్వుల ఉండలు


కావలసిన పదార్ధాలు :


బెల్లం : పావుకేజీ
నువ్వులు : అరకేజీ


తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నువ్వులు దోరగా వేపాలి.
2) ఇప్పుడు రోటిలో నువ్వులు వేసి దంచాలి, మరీమెత్తగా కాకుండా
    మూడొంతులు నలిగాక బెల్లం వేసి దంచాలి.
3) రెండు నిముషాలకు ముద్దగా అవుతుంది. 
4) ఇప్పుడు ఉండలు చేసి డబ్బాలో జాగ్రత్త చెయ్యటమే.


* ఇది ఆడవారికి, పిల్లలకు బలవర్దక మైన ఆహారం .