క్యేబెజి పచ్చడి (Pickle)



కావలసిన పదార్దాలు 


క్యేబెజి తురుము : కప్పు 
కారం :టేబుల్ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
నూనె : అర కప్పు
ఆవపిండి, మెంతు పిండి, పసుపు జీర పొడి : అన్ని కలిపి రెండు టీ స్పూన్లు 

తయారుచేయు విధానం 

1) ఒక గిన్నెలో క్యేబెజి తురుము, కారం, ఉప్పు, ఆవ, మెంతి, జిరా, పసుపు.అన్ని పొడులు, నిమ్మరసం, నూనె వేసి కలిపి ఒక జాడీలో పెట్టు కోవాలి. 
2) దీనిని ఒక రోజు తరువాత బాగా కలిపితే  పచ్చడి రెడి.
ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది.

తాటి ముంజులుతొందరగా అరగాలంటే చిట్కా (Digesting Tip in Telugu )

ముంజులు తిన్నాక చివరిలో చిన్న మామిడి ముక్క తింటే 

తొందరగా ముంజులు అరుగు తాయి, కడుపు నొప్పి కుడా రాదు.

పనసతోనలు అరుగుదలకు చిట్కా (Digesting Tip in Telugu )

పనస తొనలు తొందరగా అరగాలంటే ఈ చిట్కా  పాటించండి.

పనస తొనలు తిన్నాకా చివరి పనస తోన నూనెలో ముంచి తింటే తొందరగా అరుగుతుంది, కడుపు నొప్పిరాదు..

ఉల్లి ముక్కలు వేగంగా వేగాలంటే చిట్కా (Tip For How to Fry Onions Quickly)

ఉల్లి ముక్కలు నూనెలో తొందరగా వేగాలంటే వాటిలో కొద్దిగా మెత్తని ఉప్పు వేసి వేయిస్తే తొందరగా వేగుతాయి

కొబ్బరికి చిట్కా (Coconut Tip Health Tip in Telugu )


కొందరికి కొబ్బరి తింటే తొందరగా జీర్ణం కాదు. అలాంటి వాళ్ళు ఈ చిట్కా పాటించండి.
కొబ్బరి తిన్నాక కొద్దిగా బియ్యం గింజలు తింటే తొందరగా కొబ్బరి జీర్ణ మవ్వుతుంది.

నాటుకోడి కూర(Chicken Curry in Telugu )


కావలసిన పదార్దాలు:


నాటుకోడి ముక్కలు : కేజీ
నూనె : కప్పు
కొబ్బరు ముద్ద : కప్పు
 గసగసాలు ముద్ద : అర కప్పు 
కారం : రెండు స్పూన్లు
ఉల్లి ముద్దా : కప్పు
ఉప్పు : తగినంత
దనియాల పొడి : అర కప్పు
జీలకర్ర : పొడి : స్పూన్
కొత్తిమీర : కట్ట
యలుకులు : నాలుగు
లవంగాలు : పది
దాల్చిన చెక్క : కొద్దిగా
పసుపు : అర స్పూన్
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టూ : టేబుల్ స్పూన్

తయారుచేసే విధానం:

1) కోడి ముక్కలు కడిగి దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టూ, వేసి కలిపి కుక్కర్ లోవేసి కప్పు నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దించి పక్కన పెట్టాలి.
2) పచ్చిమిర్చి, లవంగాలు, యాలుకులు, చెక్క కలిపి మెత్తగా ముద్దలా నూరాలి.
3) ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి దానిలో ఉల్లి ముద్ద వేసి  దొరగావేయించాలి.
4) అందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
5) ఇప్పుడు దీనిలో కారం, ఉప్పు, దనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా ముద్ద , గసాలు, కొబ్బరి ముద్దలు  వేసి కలిపి కుక్కర్ లో  ఉడికించిన కోడిముక్కలు వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి పదినిముషాలు ఉడికించాలి.
6) ఇప్పుడు ముగిలిన కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.

కమ్మటి సువాసనలతో నాటుకోడి కూర రెడి.ఇది అన్నంలోకి, గారేల్లోకి చాలా బాగుంటుంది.

అటుకుల చక్రపొంగలి(Atukula Chekra Pongali in Telugu )


కావలసిన పదార్దాలు :

అటుకులు : అర కేజీ 
పెసర పప్పు : పావుకేజీ 
పంచదార : పావుకేజీ 
నెయ్యి : వంద గ్రాములు 
ఉప్పు : పావు టీ స్పూన్ 
పచ్చకర్ప్పురం పొడి : చిటికెడు 
యాలకుల పొడి : అర టీ స్పూన్ 
జీడిపప్పులు : కొద్దిగా 
ఎండు ద్రాక్షా : కొద్దిగా  
ఎండుకొబ్బరి :వందగ్రాములు 
నీళ్ళు : ముప్పావు లీటరు 

తయారుచేయు విధానం :

1) ముందుగా ఎండుకోబ్బరిముక్కలు, జీడిపప్పులు, ఎందు ద్రాక్ష  నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టాలి 
2) పంచదార లేతపాకం పట్టి దానిలో యాలకుల పొడి, కర్పూరం పొడి వేసి కలిపి పక్కన పెట్టాలి.
3) స్టవ్ ఫై నీళ్ళు మరిగించి దానిలో నానబెట్టిన పెసరపప్పు వేసి కొద్దిగా ఉడికించాలి.
4) ఇప్పుడు దీనిలో ఉప్పు, అటుకులు వేసి చిన్న మంట మీద ఉంచి దీనిలో పంచదార పాకం, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి నేయ్యివేసి  బాగాకలపాలి..
5) దీనిని అడుగంటకుండా చిన్న మంట మీదమగ్గనివ్వాలి.ఇప్పుడు స్టవ్ ఆపి ఈ గిన్నె మీద మూతపెట్టి  పావుగంట 
కదపకుండా ఉండాలి. 
6) తరువాత రెడిగా ఉన్న అటుకుల చేక్రపొంగలి అతిధులకు పిల్లలకు వడ్డించాలి.
ఎంతో రుచిగాఉండే అటుకుల చేక్రపొంగలి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

మషాలా గారెలు (Garelu in Telugu )

మషాలాగారెలు


కావలసిన పదార్దాలు

పొట్టు మినపప్పు : అర కేజీ
పచ్చిశెనగపప్పు : వందగ్రాములు
చాయ పెసర పప్పు : వంద గ్రాములు (నానబెట్టినది )
ఉల్లిముక్కలు : కప్పు
పచ్చిమిర్చి ముక్కలు : టేబుల్ స్పూన్
క్యేరేట్ తురుము, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము : అన్ని కలిపి కప్పు
 ఉప్పు : తగినంత
అల్లం ముద్ద : టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
నూనె వేయించటానికి సరిపడా

తయారుచేయు విధానం

1) మినపప్పు ను కడిగి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.అలాగే శెనగ పప్పును గట్టిగా రుబ్బాలి.
2) ఒక గిన్నెలో రుబ్బిన ఈ రెండు పప్పుల్ని వేసి దీనిలో ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు క్యరేట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు ల తురుము, ఉప్పు, జీలకర్ర, నానబెట్టినపెసరపప్పు, అల్లం ముద్ద వేసి కలపాలి.
3) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఈ పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోని పాల కవర్ ఫై గారెల్లా వత్తి కాగే నూనెలో దోరగా వేయించాలి.

వీటిలో కొబ్బరి చేట్ని, లేదా నాటుకోడి కూర తో తింటే చాలా రుచిగా ఉంటాయి.    

పొటాటో చిప్స్( స్టిక్స్ ) (Aloo Chips in Telugu )

కావలసిన పదార్దాలు :

బంగాళా దుంపలు : నాలుగు 
నూనె : తగినంత 
సెనగపప్పు : అరకప్పు 
జీలకర్ర : పావుకప్పు 
మినపప్పు : అరకప్పు 
కరివేపాకు : కొద్దిగా 
ఎండుమిర్చి : ఐదు 
వెల్లుల్లి : పది రెబ్బలు 
కొత్తిమీర: కట్ట 

తయారుచేయు విధానం :

1) బంగాళా దుంపలు చెక్కు తీసి సన్నగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీటిలో పది నిముషాలు ఉంచి నీటిని వంచేయ్యాలి.ముక్కలకు తడి లేకుండా తుడవాలి.
2) వెల్లుల్లి, ఎండుమిర్చి ని కొద్దిగా నూనె వేసి వేయించాలి.
3) నూనె లేకుండా జీలకర్ర, మినపప్పు, సెనగపప్పులు వేయించాలి.
4) ఇప్పుడు ఈ పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మిక్సిలో వేసి పొడి చెయ్యాలి.
5) ఇప్పుడు నూనె వేడి చేసి కాగిన తరువాత తడి లేకుండా తుడిచి కట్ చేసిన బంగాళా  దుంపలు  ముక్కలు వేసి కరకరలాడేలా వేయించాలి.
6) ఇప్పుడు నూనె మొత్తం వేరే గిన్నెలోకి వంచి కొద్దిగా నూనె ఉంచి దానిలో కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి.
7) అవి వేగాక వేయించిన బంగాళా దుంప ముక్కలు, మిక్సి చేసిన పప్పులపొడి, ఉప్పు వేసి కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి.
ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు.

నిమ్మ నూడిల్స్(Lemon Noodles in Telugu )



కావలసిన పదార్దాలు :

నూడిల్స్ :పావుకిలో 
నిమ్మరసం : టేబుల్ స్పూన్ 
శెనగపప్పు : అర టీ స్పూన్ 
మినపప్పు : అర టీ స్పూన్ 
ఆవాలు : అర టీ స్పూన్ 
పసుపు : కొంచెం 
కరివేపాకు : కొద్దిగా 
జీడిపప్పులు : కొద్దిగా 
ఉప్పు :తగినంత 
కొబ్బరితురుము : రెండు టీ స్పూన్లు 
పచ్చిమిర్చి : నాలుగు 
నూనె : కొద్దిగా 

తయారుచేయు విధానం

1) నీళ్ళు మరిగించి  నూడిల్స్ వేసి ఇదు నిముషాలు ఉడికించి నీళ్ళువంచి చిల్లుల  గిన్నెలో వేసి ఆరనివ్వాలి.
2) స్టవ్ ఫై కాళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించాలి.
3) అవి వేగాక జీడిపప్పులు వేసి వేయించి ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి తురుము వేసి కలిపి ఇప్పుడు ముందుగా ఉడికించిన నూడిల్స్ ను వేసి కలపాలి.
అంతే నిమ్మ నూడిల్స్ రెడి