కావలసిన పదార్దాలు:
పనీర్ : పది గ్రాములు (తురుము )
క్యేరేట్:రెండు
పచ్చి బఠాని : అర కప్పు
పచ్చిమిర్చి : మూడు
మషాలా : కొద్దిగా
నూనె : వేయించటానికి సరిపడా
బీన్స్ : పది
బంగాళా దుంప : ఒకటి
కొత్తిమీర : కట్ట
మైదా : కప్పు
ఉప్పు : తగినంత
జీడిపప్పులు : కొద్దిగా
తయారుచేయు విధానం :
1) క్యేరేట్, పచ్చి బఠాని, బీన్స్, బంగాళా దుంప లను ఉడికించి దీనికి పనీర్ తురుము , పచ్చిమిర్చి తురుము, ఉప్పు కలిపి ముద్దలా చెయ్యాలి.
దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.
2) కడాయిలో కొద్దిగా నూనె వేసి ఈ ఉండలను కాసేపు వేయించాలి.
3) ఇప్పుడు మైదా లో మసాలా, ఉప్పు, కొత్తిమీర, జీరా పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి ముద్దలా చెయ్యాలి.
4) ఈ ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసుకోని కాస్త వెడల్పు చేసి దానిలో పనీర్ ఉండను పెట్టి మళ్ళిఉండాలా చేసి దీనిని చేతితో కొంచెం వెడల్పుగా చెయ్యాలి.(బిళ్లలుగా )వీటినే కబాబ్స్ అంటారు.
5) ఈ బిళ్లలుగా చేసిన వాటికి ఒక వైపు జీడిపప్పు గుచ్చి పక్కనపెట్టాలి.
6) ఇలా అన్ని చేసిన తరువాత నూనె వేడి చేసి వీటిని దొరగావేయించాలి.
వేడిగా ఉన్నప్పుడే తింటే ఆ రుచే వేరు.
Post a Comment