మజ్జిగచారు (Majjiga Charu / Spiced Buttermilk)

వంటపేరు : మజ్జిగచారు


కావలసిన పదార్ధాలు :


పుల్లటి మజ్జిగ : పావు లీటరు (గ్లాసుడు )
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండిమిర్చి: రెండు
వెల్లుల్లి : నాలుగు రెమ్మలు
పసుపు : అర టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్టూ : టీ స్పూన్
ఉల్లి ముక్కలు : కప్పు
నూనె : టేబుల్ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా


తయారుచేయు విధానం :


1) మజ్జిగలో పచ్చిమిర్చి పేస్టూ, పసుపు, కొత్తిమిర వేసి కలిపి పక్కనపెట్టాలి. 2) ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో నూనె వేడి చెయ్యాలి. 
3) నూనే కాగాక, పోపుదినుసులు వేసి వేగాక, వెల్లుల్లి, ఎండి మిర్చి వేసి 
    వేగాక, కరివేపాకు, ఉల్లి ముక్కలు కూడా  వేసి మజ్జిగ తాలింపు వెయ్యాలి.
4) ఇప్పుడు ఉప్పు కలిపి స్టవ్ ఆపాలి.


* అంతే మజ్జిగ చారు రెడీ.