కర్జ్జురపు లడ్డ్లు (ఉండలు) (Karjuram Laddulu Preparation in Telugu)

ఖర్జూరం లడ్డ్లు (ఉండలు )

కావలసిన పదార్దాలు: 

మెత్తగా చేసిన ఖర్జూరం పేస్టూ _కప్పు 
ఎండు కొబ్బరి పొడి -కప్పు 
జీడిపప్పులు - కొద్దిగా 
కిస్మిస్లు -  కొద్దిగా 
నెయ్యి  - రెండు టీ స్పూన్లు 

తయారుచేయు విధానం: 

1) స్టవ్ ఫై కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి జీడి పప్పులు ,కిస్మిస్లు వేసి వేయించి ఒకగిన్నేలోకి తీసుకోవాలి. 

2) ఇప్పుడు అదే కళాయిలో కొబ్బరి పొడి వేసి కొద్దిగా వేయించాలి.

3) ఒక గిన్నెలో వేయించిన కొబ్బరి పొడి, వేయించిన జీడిపప్పులు,కిస్మిస్లు, కర్జురం పేస్టూ, మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి లాడ్డుల్లా చుట్టాలి..
4) అంతే ఎంతోరుచిగా ఉండే కర్జురం లడ్డులు రెడి.