1
కలబంద తో చిట్కా.

1) కలబంద గుజ్జు రోజు ఒక స్పూన్ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది.

2) ఆడపిల్లలకు ప్రతి నెలలో (ఆ రోజుల్లో) చాలా ఉపయోగ పడుతుంది.

3) అలాగే ముఖానికి రోజు రాస్తు అరా గంట ఆగి ముఖం కడిగితే ముఖం కాంతివంతంగా అవవుతుంది.

బియ్యప్పిండితో గారెలు.


కావలసిన పదార్దాలు .

బియ్యప్పిండి -రెండు కప్పులు 

పెరుగు - ఒక కప్పు 

ఉల్లి పాయ - ఒకటి 

పచ్చిమిర్చి  - రెండు

ఉప్పు - తగినంత 

అల్లం - చిన్న ముక్క 

జీలకర్ర - టీ స్పూన్ 

నూనె - అర కిలో 


తయారుచేయు విధానం ;


1) బియ్యప్పిండిలో పెరుగు వేసి గారెల పిండిలా కలపాలి.

2) ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలుగా కోసి పిండిలో వేసి ఉప్పు, జీలకర్ర కూడా వేసి మొత్తం పిండి కలిపి పక్కనపెట్టాలి,

3) ఇప్పుడు స్టవ్ ఫై నూనె వేడి చేసి ఇలా కలిపిన పిండిని గారెల్లా  వత్తి   కాగే నూనెలో వేసి రెండు ప్రక్కలా దోరగా 

వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. 

 4)
ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చిన చెట్నితో తినటమే.

అంతే   ఎంతో రుచిగా ఉండే బియ్యప్పిండి గారెలు రెడి.


ఉగాది పానీయం 

కావలసిన పదార్దాలు :

మామిడికాయలు : రెండు 
ఉప్పు : స్పూన్ 
కారం : పావు టీ స్పూన్ 
బెల్లం : వంద గ్రాములు 
వేపపువ్వు : టేబుల్ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) పుల్లని పచ్చి మామిడి కాయలు నీటిలో వేసి ఉడికించాలి.

2) ఉడికిన తరువాత అదే నీటిలో చల్లార్చి జ్యూస్ లా చేసి టెంకను తీసెయ్యాలి.

3) ఇప్పుడు ఈ జ్యూస్ లో బెల్లం, ఉప్పు, కారం, వేపపువ్వు వేసి 

మరి కాస్త చల్లని నీళ్ళుకలిపితే ఉగాది పానీయం రెడి.

4) ఉగాది పచ్చడితో పాటే ఈ పానీయాన్ని అతిధులకు అందించండి.


కావలసిన పదార్దాలు:

కాలీఫ్లవర్ : అర కేజీ
టమాటాలు  : మూడు
ఉల్లి పాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
పోపుదినుసులు : టేబుల్ స్పూన్ (ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు )
కరివేపాకు : రెండు రెమ్మలు
వెల్లుల్లి : రెండు రెబ్బలు

తయారుచేయు విధానం :

1) టమాటాలు, ఉల్లి, మిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి.

2) కాలిఫ్లవర్ పురుగులు లేకుండా చూసి  చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించి నీళ్ళు లేకుండా వార్చాలి.పక్కన పెట్టాలి.
.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు, కరివేపాకు, ఉల్లి, ముక్కలు మిర్చి ముక్కలు వేసి వేగాక టమాటా ముక్కలు వేసి కాసేపు వేయించాలి.

4) టమాటా  ముక్కలు మెత్త బడ్డ తరువాత  ఉడికించిన కాలిఫ్లవర్  ముక్కలు వేసి కాసేపు వేయించి ఉప్పు, కారం వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి.

అంతే కాలిఫ్లవర్ టమాట కూర రెడి.


కావలసిన పదార్దాలు:
పనీర్ : పది గ్రాములు (తురుము )
క్యేరేట్:రెండు 
పచ్చి బఠాని : అర కప్పు 
పచ్చిమిర్చి : మూడు
మషాలా : కొద్దిగా 
నూనె : వేయించటానికి సరిపడా 
బీన్స్ : పది 
బంగాళా దుంప : ఒకటి 
కొత్తిమీర : కట్ట 
మైదా : కప్పు 
ఉప్పు : తగినంత 
జీడిపప్పులు : కొద్దిగా 

తయారుచేయు విధానం :

1) క్యేరేట్, పచ్చి బఠాని, బీన్స్, బంగాళా దుంప లను ఉడికించి దీనికి పనీర్ తురుము , పచ్చిమిర్చి  తురుము, ఉప్పు  కలిపి ముద్దలా చెయ్యాలి.
దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.

2) కడాయిలో కొద్దిగా నూనె వేసి ఈ ఉండలను కాసేపు వేయించాలి.

3) ఇప్పుడు  మైదా లో మసాలా, ఉప్పు, కొత్తిమీర, జీరా పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి ముద్దలా చెయ్యాలి.

4) ఈ ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసుకోని కాస్త వెడల్పు చేసి దానిలో పనీర్ ఉండను పెట్టి మళ్ళిఉండాలా చేసి దీనిని చేతితో కొంచెం వెడల్పుగా చెయ్యాలి.(బిళ్లలుగా )వీటినే కబాబ్స్ అంటారు.

5) ఈ బిళ్లలుగా చేసిన వాటికి ఒక వైపు జీడిపప్పు గుచ్చి పక్కనపెట్టాలి.

6) ఇలా అన్ని చేసిన తరువాత నూనె వేడి చేసి వీటిని దొరగావేయించాలి. 
వేడిగా ఉన్నప్పుడే తింటే ఆ రుచే వేరు.

తలనొప్పి తగ్గాలంటే చిట్కా.

1) మందార పూలను ఎండబెట్టి  పొడిచేసి కొబ్బరి నూనెలో కలిపి తలకు 

రాసుకుంటే తలనొప్పి తగ్గడమే కాకుండా జుట్టు నల్లగా వత్తుగా 

పెరుగుతుంది.

ఖర్జూరం లడ్డ్లు (ఉండలు )

కావలసిన పదార్దాలు: 

మెత్తగా చేసిన ఖర్జూరం పేస్టూ _కప్పు 
ఎండు కొబ్బరి పొడి -కప్పు 
జీడిపప్పులు - కొద్దిగా 
కిస్మిస్లు -  కొద్దిగా 
నెయ్యి  - రెండు టీ స్పూన్లు 

తయారుచేయు విధానం: 

1) స్టవ్ ఫై కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి జీడి పప్పులు ,కిస్మిస్లు వేసి వేయించి ఒకగిన్నేలోకి తీసుకోవాలి. 

2) ఇప్పుడు అదే కళాయిలో కొబ్బరి పొడి వేసి కొద్దిగా వేయించాలి.

3) ఒక గిన్నెలో వేయించిన కొబ్బరి పొడి, వేయించిన జీడిపప్పులు,కిస్మిస్లు, కర్జురం పేస్టూ, మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి లాడ్డుల్లా చుట్టాలి..
4) అంతే ఎంతోరుచిగా ఉండే కర్జురం లడ్డులు రెడి. 



కావలసిన పదార్దాలు :

ఓట్స్  పొడి  - కప్పు 
కోవా - కప్పు 
మైదా - కప్పు 
పంచదార - రెండు కప్పులు 
యాలుకల పొడి - టీ స్పూన్ 
నెయ్యి - కప్పు 
నూనె - కప్పు 

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి పంచదార లేత తీగ పాకం పట్టాలి.దీనిలో యాలుకల పొడి వేసి పక్కన పెట్టాలి.

2) ఒకగిన్నెలో ఓట్స్ పొడి, మైదా,కోవా, వేసి పాలు పోస్తూ ముద్దలా కలిపి దానిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.

3) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి, నూనె వేసి వేడి చెయ్యాలి.

4) ఇప్పుడు కాగిన నూనె లో చేసి పక్కన పెట్టిన ఉండలు వేసి దోరగా వేయించి పంచదార పాకంలో వేసి అర గంట ఆగి సర్వ్ చెయ్యాలి. 

అంతే ఓట్స్ గులాబ్ జామ్లు రెడి.

1
గోధుమ హల్వా 

కావలసిన పదార్దాలు :


గోధుమ పిండి _కప్పు 
పంచదార -కప్పు 
యాలుకలు -రెండు 
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు 
పాలు - కప్పు
నీళ్ళు - కప్పు 
జీడిపప్పులు - పది 

తయారుచేయు విధానం :

1 ) స్టవ్ ఫై కళాయి పెట్టి  నెయ్యి వేడిచేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి,

2) అదే నెయ్యిలో గోధుమ పిండి వేసి దోరగా వేయించాలి,

3) దోరగా వేగిన గోధుమ పిండిలో పాలు ,నీళ్ళు ,పంచదార వేసి ఆగకుండా కలుపుతూ ఉండాలి,

4) కాసేపటికి గట్టిపడుతుంది.ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసి యాలుకలు పొడి వేసి మరి కాసేపు కలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.

5) ఒక ప్లేటుకు నెయ్యి రాసి గట్టిపడిన గోధుమ హల్వాను ప్లేటులోకి వేసి సమానంగా చేసి వేయించిన జీడిపప్పులు అలంకరించి సర్వ్ చెయ్యాలి,

6)అంతే ఎంతో రుచిగా ఉండే గోధుమ హల్వా రెడి.


కావలసిన పదార్దాలు :

నానబెట్టిన సెనగలు : కప్పు
నానబెట్టిన సగ్గుబియ్యం : కప్పు
నానబెట్టిన మినపప్పు: పావు కప్పు 
ఉల్లిముక్కలు : కప్పు 
పచ్చి మిర్చిముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర,కరివేపాకు : అర కప్పు 
అల్లంపేస్టూ :టీ స్పూన్ 
నూనె : వేయించటానికి సరిపడ

తయారుచేయు విధానం :

1 ) సగ్గుబియ్యం, శెనగలు, మినపప్పు,మిక్సిలో వేసి మెత్తగా గట్టిగా మిక్సి పట్టాలి.
2) మెత్తగా చేసిన సెనగలు సగ్గుబియ్యం మినపప్పు ముద్ద లో ఉప్పు, కారం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్టూ వేసి కలపాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి నూనె కాగాక అన్నికలిపిన ఈ పిండిని గారెల్లా చేసి వేడి నూనెలో వేసి దోరగా వేయించాలి.
4) రెండు ప్రక్కలా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి.  



కావలసిన పదార్దాలు :

పొడిగా వండిన అన్నం : రెండు కప్పులు
దనియాలు : రెండు టీ స్పూన్లు
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
ఉప్పు : సరిపడ
మిరియాలు : పది
ఎండు మిర్చి:  పది
చింతపండు గుజ్జు : అర కప్పు
బెల్లం : పావుకప్పు
కొబ్బరి తురుము : అర కప్పు
ఆవాలు  : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
ఉడికించిన బఠాని : పావు కప్పు
నూనె  : అర కప్పు
కేరెట్ -:ఒకటి 

పసుపు :పావు టీ స్పూన్ 

తయారు చేయు  విధానం:

1) కొంచెం నూనెలో దనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు వేయించి పొడి చేసుకోవాలి
2) చింతపండు గుజ్జు, బెల్లం ఉడికించి  పక్కనపెట్టుకోవాలి.
3) ఒక ప్లేటులో ఉడికించిన అన్నం, చింతపండు బెల్లం గుజ్జు , గ్రైడ్ చెసిన మిరియాలపొడి , కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.

4) ఇప్పుడు స్టవ్ ఫై మిగిలిన నూనె వేసి వేడి చేసి కరివేపాకు ఆవాలు వేసి తరువాత కేరెట్ పసుపు వేసి  తరువాత అన్ని కలిపిన అన్నం వేసి కలిపి చిన్న మంట మీద పది నిముషాలు ఉంచి  స్టవ్ ఆపాలి.


కావలసిన పదార్దాలు :

బియ్యం -ఒక కప్పు 
నెయ్యి - రెండు టీ స్పూన్లు 
లవంగాలు,చెక్క,యాలుకలు,బిర్యనిఆకు -రెండు రెండు చొప్పున తీసుకోవాలి.
మిల్మేకర్ - అరకప్పు 
ఉప్పు - తగినంత 
పుదినా - కట్ట 
కొత్తిమీర - కట్ట 
బిర్యానీ మసాలా - టీ స్పూన్ 
ఉల్లి ,పచ్చిమిర్చి ముక్కలు - అర కప్పు 

తయారుచేయు విధానం :

1) బియ్యం కడిగి పక్కన పెట్టాలి. మిల్మేకర్ వేడినీళ్ళల్లోవేసి ఒక నిముషం ఉంచి నీళ్ళు పిండి పక్కనపెట్టాలి.

2) ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

3) నెయ్యి వేడి అయ్యిన తరువాత చెక్క,లవంగాలు,యలుకులు,బిర్యానీఆకు వేసి వేయించుకోవాలి. 

4) అవి వేగాక పుదినా, ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.

5) తరువాత పక్కన పెట్టిన మిల్మేకర్ వేసి కాసేపు వేయించి కడిగి నానబెట్టిన బియ్యం వేసి ఒక సారి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి దానిలో ఉప్పు, బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి.

6) కాసేపటికి బిర్యానీ రెడి అవ్వుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి  దీనిలో కొత్తిమీర వేసి మూత పెట్టాలి.

అంతే సర్వ్ల్ చెయ్యటానికి  మిల్మేకర్  బిర్యానీ రెడి. 



కర్జ్జురం హల్వా:

ఖర్ఝురం పేస్టూ :  కప్పు
ఎండు ఖర్జురం ముక్కలు : అర కప్పు
జీడి పప్పు ముక్కలు, బాదాం ముక్కలు : అర కప్పు
నెయ్యి  : అరకప్పు
కిస్మిస్లు : పావుకప్పు
పంచదార : రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము : అర కప్పు  

తయారుచేయు విధానం :
1) ముందుగా నేతిలో జీడిపప్పులు,బాదాం పప్పులు, ఎండు ఖర్జురం, కిస్మిస్లు విడివిడిగా వేయించి ఒకగిన్నేలో వేసుకోవాలి.
2) అదే పాన్లో మరికొంచెం నెయ్యి వేసి కర్జురం పేస్టూ వేసి వేయించాలి.
3) అది నేతిలో వేగిన తరువాత కొబ్బరి కోరు, పంచదార, వేయించిన డ్రై ప్రుట్స్ వేసి కలపాలి.
4) కాసేపు వేపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అంతే కజ్జురం స్వీట్ రెడి.

కొందరు మొహం జిడ్డుగా ఉందని బాదపడుతుంటారు.
అలాంటివారు ఆపిల్ గుజ్జు మొఖానికి పట్టించి పావు గంట తరువాత కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
ఇలా వారానికి రెండు సార్లు చెయ్యాలి.


నెయిల్ పాలిష్ గడ్డకట్టిందనిబాధపడుతున్నారా?
బాధపడవద్దు. గడ్డకట్టిన నెయిల్ పాలిష్ సీసాని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి చూడండి ,అది మీరు వాడటానికి రడిగా  ఉంటుంది,



కావలసిన పదార్దాలు :


పెసర పప్పు _ఒక కప్పు 
పంచదార -ఒక కప్పున్నర 
నెయ్యి-పావుకప్పు 
యాలుకలు పొడి- టీ స్పూన్ 
జీడిపప్పులు - పది (నేతిలో వేయిన్చినవి ) 

తయారుచేయు విధానం

1) ముందుగా పెసర పప్పును దోరగా వేయించాలి.

2) వేయించిన పప్పును మిక్సిలో వేసి పిండిలా చెయ్యాలి.

3) స్టవ్ ఫై కళాయి పెట్టి పంచదార వేసి అర కప్పు నీళ్ళు వేసి పాకం పట్టాలి.

4) తీగ పాకం వచ్చాక మిక్సి చేసిన పెసర పిండిని వేసి కలపాలి.

5) ఇప్పుడు పంచదార పాకంలో పెసర పిండి ఉడుకుతుంది.

6) ఇది ముద్దలా అవ్వుతుండగా నెయ్యి వేసి కలపాలి.

7) కాసేపటికి కళాయి కి అంటుకోకుండా  ఈ ముద్ద విడిగా వస్తుంది.

8) ఇప్పుడు ఒక ప్లేటుకి నెయ్యి రాసి ఇలా తయారుయ్యిన పెసరు 

మిశ్రమాన్ని వేసి కాసేపు చల్లారనివ్వాలి 

9) కాస్త గోరు వెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాని కొద్దిగా తీసుకోని లాడ్డులుగా చుట్టాలి.

10) అలా అన్ని చుట్టాక ఫై న జీడిపప్పులు అలంకరిస్తే సరి పెసరు లడ్డు రెడి .
Powered by Blogger.