Showing posts with label Beauty Tips. Show all posts

కొందరు మొహం జిడ్డుగా ఉందని బాదపడుతుంటారు.
అలాంటివారు ఆపిల్ గుజ్జు మొఖానికి పట్టించి పావు గంట తరువాత కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
ఇలా వారానికి రెండు సార్లు చెయ్యాలి.


నెయిల్ పాలిష్ గడ్డకట్టిందనిబాధపడుతున్నారా?
బాధపడవద్దు. గడ్డకట్టిన నెయిల్ పాలిష్ సీసాని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి చూడండి ,అది మీరు వాడటానికి రడిగా  ఉంటుంది,


కొందరికి జుట్టు బాగా ఊడిపోతుంది అలాంటి వారు ఇలా చేసి చుడండి.

అలాగే కలబంద గుజ్జు తలకు పెట్టుకొని తలంతా పట్టించి అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.


బ్యూటి టిప్స్
చలి కాలంలో చాలా మందికి పాదాలు పగుళ్ళు వచ్చి చాలా బాధపడతారు.
అలంటి వారు ఇలా చేసి చూడండి.
(అలోవెర) కలబంద గుజ్జు తీసి పాదాల పగుళ్ళు మీద రాస్తే పగుళ్ళు తగ్గిపోతాయి.

ఈ మద్య మగవాళ్ళు ఒక మాట తరుచుగా అనటం వింటున్నాం.
అదే మొఖం నల్లబడు తుంది అనే మాట .
అసలు మొఖం ఎందుకు నల్లబడుతుందో తెలుసుకుంటే దానికి పరిష్కారం ఆలోచించవచ్చు.
ఇలా నల్లబడే సమస్యనే పెగ్మెంటేషన్అంటారు.
 మధ్యవయసు పురుషులు ఈ సమస్య తో ఎక్కువుగా బాధపడుతున్నారు .
దీనిని పూర్తిగా రూపు మాపడం కాష్టమే  కాని చర్మంలో ఈ పెగ్మేంటేష కలిసి పోయేలా చయ్యేచ్చు.

దీనికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఒత్తిడికిగురవ్వగూడదు.
ఎండలో తిరగగూడదు.
కాలుష్యానికి దూరంగా ఉండాలి.
సాద్యమైనంత వరకు మందు వాడటం తగ్గించాలి.
ఎండలో ఎక్కువుగా తిరగ గూడదు
తప్పని సరైవేళ్ళాల్సి వస్తే సన్ ప్రొటెక్షన్ క్రీం రాయాలి.
మొఖాన్ని మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
ప్రకృతి సిద్ధ మైన ఉత్పత్తులనే వాడాలి. అంటే ఆర్గానిక్ బ్యూటి ప్రోడక్ట్స్ మాత్రమేవాడాలి.
పెగ్మేగ్మేంటేషన్ ఉన్న వాళ్ళు బ్లీచ్ వాడగూడదు .
మొఖాన్ని వేళ్ళతో వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చస్తే రక్త ప్రసరణ బాగా జరిగి నల్లని మచ్చలు తగ్గుతాయి.
నిమ్మరసం కూడా బ్లీచ్ లా పనిచేస్తుంది.
మంచినీరు బాగా పనిచేస్తుంది అందుకని రోజు పది క్లాసులు నీళ్ళుతాగాలి.  
మనం తీసుకొనే ఆహరం లో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ ఇ బి  పిగ్మెంటేషన్ తగ్గటానికి ఉపయోగపడతాయి.
అందుకని క్యారేట్, టొమాటో,దోస ,ఆకుకూరలు,నట్స్,పుల్లని పళ్ళు తిసుకోవాలి.
ఏరోబిక్, ఎక్సర్ సైజులు వాకింగ్ జాకింగ్ చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగుతుంది.
దీనివల్ల పెగ్మేంటేషన్వచ్చే సమస్య తగ్గుతుంది. 

1

తలలో పేలు పోవాలంటే ఇలా చేసి చుడండి

వేపాకులు ముద్దగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి కాసేపు ఆగి తలస్నానం చేస్తే పేలు పోతాయి
అంతే కాదు చుండ్రు కుడా పోయి జుట్టు చక్కగా పెరుగుతుంది.



మృదువైన చర్మం కోసం చిట్కా

మనం స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసి కాచి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది
అంతే కాకుండా చర్మం వ్యాధులు రావు.వంటి నొప్పులు కుడా రావు.


వేపాకులు తో చిట్కా
కాంతివంతమైన ముఖం కోసం చిట్కా

కొన్ని వేపాకులు, కొంచెం గంధం కలిపిమెత్త గా నూరి దానిలో చిటికెడు పసుపు కలిపిమోఖనికి రాసి ఐదునిముషాలు ఆగి చల్లని నీటితో కడిగేస్తే మొఖం మీద మొటిమలు, మచ్చలు పోయి మొఖం కాంతివంతంగా ఉంటుంది


కాంతివంతమైన మొఖానికి చిట్కా
బాదాం పప్పు ఒక రాత్రంత నానబెట్టి మెత్తగా పేస్టులా చేసి మొఖానికి రాస్తే కాంతివంతంగా అవ్వుతుంది

అంతే కాకుండా రోజు రెండు, మూడు బాదాం పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది.



ముఖం మృదువుగా ఉండటానికి ఈ చిట్కా 
1) బాదం నూనెలో శెనగపిండి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. 
 మీకు వీలున్నప్పుడుల్లా ఇలా తరుచూ చేస్తుంటే ముఖం ఫై ఉన్న మొటిమలు, మచ్చలు పోతాయి మీకే మంచి మార్పు కనిపిస్తుంది.


 గులాబీ రంగులాంటి పెదవులు కావాలంటే ఇలా చేసి చుడండి.

1) పెదవులఅందంగా ఉండాలంటే గ్గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదవుల ఫై రాయండి .

 తర్వాత కడిగి , గులాబీరేకులు పేస్ట్‌లా చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి.
ఇలా చేస్తుంటే పెదవులు అందం గా ఉంటాయి.



1) మీకు మృదువుగాఉండే ముఖం కావాలంటే ఇలాంటి చిట్కాలు చేసి చుడండి.ఫలితం మీకే తెలుస్తుంది

2) మూడు టీ స్పూన్ల తేనెలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి , వేళ్లతో సున్నితంగా మసాజ్ చెయ్యండి.

 ఇలా  చేసి పది నిమిషాల ఆగి , గోరువెచ్చని నీటితో ముఖం కడగితే ముఖం మృదువుగా ఉంటుంది. పోడిబారటం కుడా తగ్గుతుంది.
. 

ముఖం ఫై నల్లని మచ్చలు ఉంటె ఇలా చేసి చుడండి.

క్యారెట్‌, క్యాబేజీ, కలిపి పేస్ట్‌గా చేసి, దానిలోకొంచెం పాల మీగడ, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోని , ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడడిగేసుకుంటే ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోతాయి . 

కొందరికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది అలాంటి వారికీ ఈ చిట్కా.

ఉసిరి రసం నువ్వులనూనె సమానంగా తీసుకోని తలకు రాసి నెమ్మదిగా మర్ధనా చేసి గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది.దువ్వెన పెట్టాలంటేనే బయపడుతుంటారు.అలాంటి వాళ్ళుకు ఈ చిట్కా .

ఉల్లిపాయను మెత్తగా చేసి దానిలో కొద్దిగా తేనే కలిపి జుట్టుకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.

జుట్టు జీవం కోల్పోయినట్లు ఉంటుందా? మృదువుగాఉండాలంటే ఈ చిట్కా పాటించండి.

గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం, కొద్దిగా పెరుగు తీసుకోని కలిపి తలకు పట్టించి గంట ఆగిన తరువాత 
తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

జుట్టు ఉడిపోతుంటే ఈ చిట్కా పాటించండి

మందరాపూలు తీసుకోని  కొబ్బరి నూనెలో వేసి అవి నల్లబడేవరకు కాచి చల్లార్చి నిల్వ ఉంచుకొని  రోజు తలకు రాసి మర్ధనా చేసుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.

1) బాదం నూనెలో శెనగపిండి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. 2) మీకు వీలున్నప్పుడుల్లా ఇలా తరుచూ చేస్తుంటే ముఖం ఫై ఉన్న మొటిమలు, మచ్చలు పోతాయి.
 మీకే మంచి మార్పు తెలుస్తుంది
Powered by Blogger.