టమాటా బజ్జి (Tomato Bajji Preparation in Telugu)

కావలసిన పదార్దాలు :


టమాటాలు : మూడు 
శెనగపిండి : కప్పు 
ఉల్లిపాయలు : రెండు 
అటుకులు : అరకప్పు 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర తురుము : పావు స్పూన్ 
నిమ్మరసం :  టీ స్పూన్ 
గరంమసాలా : పావు టీ స్పూన్ 
వేయించిన పల్లీలు : రెండు టేబుల్ స్పూన్లు 
నూనె : పావుకేజీ 


తయారుచేయు విధానం :


1) శెనగపిండిలో వామ్ము, ఉప్పు వేసి నీళ్ళు కలిపి బజ్జిపిండిలా కాస్త చిక్కగా కలపాలి.
2) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక టమాటాలు శెనగపిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిలా వేసి దోరగా వేయించి ఒక ప్లేటులోకి తియ్యాలి.
3) కాస్త చల్లారిన తరువాత బజ్జిని మధ్యకు కట్ చేసి బజ్జినుండి టమాటను వేరుగా తియ్యాలి.
4) ఇలా కట్ చేస్తే ఈ బజ్జ్జీలు ఆరు చిన్నగిన్నేల్లా ఉంటాయి.
5) ఇప్పుడు బజ్జీ నుండి తీసిన టమాటాలు చిన్నచిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి.
6) ఒక గిన్నెలో ఈ టమాటాముక్కలు, ఉల్లిముక్కలు, అటుకులు, ఉప్పు, గరంమసాలా, పల్లీలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
7) ఇప్పుడు బజ్జిగిన్నెల్లో నిండుగా ఈ కలిపిన ఉల్లి మిశ్రమం వేసి సర్వ్ చెయ్యాలి.