కావలసిన పదార్దాలు :
ఓట్సు : అరకేజి
బెల్లం : అర కేజీ
పిస్తా పప్పులు : పావు కప్పు
జీడిపప్పులు : పావుకప్పు
నువ్వులు : పావు కప్పు
బాదం పప్పులు : పావు కప్పు
పల్లీలు : పావు కప్పు
నెయ్యి : అర కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె లేకుండా ఫైన చెప్పిన పప్పులు, ఓట్సు విడివిడిగా వేయించుకోవాలి.
2) ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెపెట్టి దానిలో బెల్లం, కొద్దిగా నీళ్ళు వేసి పాకంపట్టాలి.
3) ముదురుపాకం వచ్చాక కొద్దిగా నెయ్యి వేసి వేయించిన పప్పులు, ఓట్సు వేసి కలపాలి.
4) ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఈ పాకంతో ఉన్న పప్పుల్ని వేసి సమంగా సర్ది చల్లారక మనకు నచ్చిన అకారంలో కట్ చేసుకోవాలి.