మైదా కారం డైమండ్స్ (Maida Karam Spicy Diamonds in Telugu)

కావలసిన పదార్దాలు :

మైదా : అరకేజీ 
నూనె : అరకేజీ  
ఉప్పు:  కొద్దిగా 
వంటసోడా : అర టీ స్పూన్
డాల్డా : వంద గ్రాములు 
కారం : టీ స్పూన్ 
వామ్ము : టీ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) మైదా జల్లించి ఒకపళ్ళెంలో వేసుకోవాలి. డాల్డా కరిగించాలి.
2) మైదాలో ఉప్పు, వంటసోడా, కరిగించిన డాల్డా, కారం,  వామ్ము వేసి మైదా బాగాకలిపాలి. 
3) తరువాత నీళ్ళుపోసి ముద్దలా కలిపి ఒకగంట పక్కనపెట్టాలి.
4) గంటతరువాత మైదాముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీలా పల్చగా వత్తుకోవాలి.
5) ఇలా చేసిన చేపాతీలను డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చేసుకోవాలి.
6) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి కట్ చేసిన ముక్కలు నూనెలో వేసి దోరగా వేయించాలి. అంతే మైదా,కారం డైమండ్స్ రెడీ.