మరుకొని పాయసం (Marukoni Payasam in Telugu)

కావలసిన పదార్దాలు:


పాలు : కప్పు
సగ్గుబియ్యం : పావుకప్పు
కండెన్స్డ్ మిల్క్ : పావుకప్పు
షుగర్ : పావుకప్పు
మరుకొనిలు : పావుకప్పు(కలువపువ్వు గింజలుతో తయారుచేస్తారు) 
కొబ్బరి పొడి : టేబుల్ స్పూన్


తయారుచేయు విధానం :


1) స్టవ్ మీద పాలుపెట్టి మరుగుతుండగా సగ్గుబియ్యం వేసి వుడికించాలి.
2) చిన్నమంట మీద ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం వుడికిన తరువాత పంచదార వేసి కలపాలి.
3) ఐదునిముషాలు వుడికించి మరుకొనిలు వేసి ఒకనిముషం ఆగి కండెన్స్డ్ మిల్క్ వేసి మూతపెట్టి ఐదునిముషాలు వుడికించి, యాలకులపొడి వేసి స్టవ్ ఆపాలి.


* అంతే మరకని పాయసం రెడీ.