క్యారెట్ ఫింగర్ చిప్స్ (Carrot Finger Chips in Telugu)

కావలసిన పదార్దాలు: 


క్యారెట్లు : ఐదు 
కార్న్ ఫ్లోర్ : మూడు టీ స్పూన్లు 
సెనగపిండి : ఒక టీ స్పూన్ 
సోయాసాస్ : టేబుల్ స్పూన్ 
చిల్లీసాస్ : టేబుల్ స్పూన్ 
టమాటా సాస్ : టేబుల్ స్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు :తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
నూనె : వేయించటానికి సరిపడా 


తయారుచేయు విధానం :


1) క్యారెట్లు నిలువుగా పల్చగా కట్ చెయ్యాలి. 
2) నూనె తప్ప ఫైనచెప్పిన పదార్దాలన్ని ఒకగిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి ఉండలులేకుండా కలుపుకోవాలి.
3) స్టవ్ ఫై కళాయిపెట్టి నూనె వేడిచేయ్యాలి.
4) క్యారెట్ ముక్కల్ని కలిపినపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.