కృష్ణాజిల్లా బండ పచ్చడి (Krishna Zilla Banda Pachhadi in Telugu)

కావలసిన పదార్దములు :


ఎండిమిర్చి : పది 
ఉల్లుపాయలు : రెండు 
ఉప్పు : సరిపడా 
చింతపండు : నిమ్మకాయంత 
జీలకర్ర : టీ స్పూన్ 
వెల్లుల్లి రేకలు : ఏడు 
నూనె రెండు : టీ స్పూన్లు 
పోపుగింజలు : టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 


తయారుచేయు విధానం :


1) నూనె వేడిచేసి ఎండిమిర్చి వేయించాలి.
2) వీటికి ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర కలిపినూరాలి. కాస్త నలిగిన తరువాత ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా నూరాలి.
3) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత నూరిన ఈ పచ్చడిని వేసి తాలింపు పెట్టాలి.
అంతే ఎండిమిర్చి బండపచ్చడి రెడీ.