అరటికాయ కోవా లడ్డు (Banana Laddu in telugu Aratikaya Kova Laddu)

కావలసిన పదార్దాలు :


అరటికాయ : ఒకటి
కోవా : కప్పు
షుగర్ : అర కప్పు 
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు 
కొబ్బరి తురుము : అర కప్పు 
జీడిపప్పులు : పది 
యాలుకులు పొడి : టీ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) స్టవ్ మీద కళాయిపెట్టి నెయ్యి వేడిచెయ్యాలి.
2) కాగిన నేతిలో కిస్ మిస్ లు వేసి వేయించాలి. తరువాత దీనిలోనే కోవా, కొబ్బరితురుము వేసి కాసేపు వేయించాలి.
3) ఇప్పుడు పంచదార వేసి కరిగిన తరువాత అరటికాయముద్ద వేసి కలుపుతూ ఉండాలి.
4) ఇప్పుడు జీడిపప్పుల పొడి, యాలుకులు పొడి వేసి కలిపి స్టవ్ ఆపాలి.
5) ఈ మిశ్రమం ముద్దలా అవ్వుతుంది, చల్లారాక ఉండలుగా చుట్టుకోవాలి.