కావలసిన పదార్దాలు :
బియ్యం : అరకేజి
వంకాయలు : పావుకేజీ
ఆవాలు : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
పల్లి : మూడు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
సెనగపప్పు: అర టీ స్పూన్
వాంగీ బాత్ మసాలా : టీ స్పూన్ (మార్కెట్లో దొరుకుతుంది )
జీడిపప్పులు : పది
నూనె : పావు కప్పు
పచ్చిమిర్చి : మూడు
తయారుచేయు విధానం :
1) బియ్యం కడిగి అన్నం వండి పక్కనపెట్టాలి. వంకాయలు నిలువుగా ముక్కలు కొయ్యాలి. పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక ఆవాలు, సెనగపప్పు, జీడిపప్పు, పల్లీలు వేసి వేగిన తరువాత పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
3) తరువాత వంకాయముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి రెండునిముషాలు మూతపెట్టాలి. వంకాయముక్కలు మగ్గుతాయి.
4) ఇప్పుడు వాంగీబాత్ మసాల, అన్నం వేసి ఒకసారి కలిపి ఉప్పు, నిమ్మరసం కలిపి సర్వ్ చెయ్యాలి.