బ్రెడ్ ముక్కలు : పది
ఉల్లి ముక్కలు : కప్పు
క్యాప్సికం ముక్కలు : అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు : అర టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
కొత్తిమీర : కొద్దిగా
ఉడికించిన బంగాళా దుంప : ఒకటి
ధనియాలపొడి : అర టీ స్పూన్
మైదా : పావుకేజీ
వాము : టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచేసి ఉల్లి ముక్కలు, క్యాప్సికంముక్కలు వేసి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
2) ఇప్పుడు ఉప్పు, కారం, దనియాల పొడి, ఉడికించి చిదిమిన బంగాళాదుంప వేసి ఒకనిముషం కలిపి కొత్తిమీర వేసి దించి చల్లారనివ్వాలి.
3) మైదాలో కొద్దిగా ఉప్పు, కారం, వామ్ము వేసి నీళ్ళుపోసి జారుగా కలపాలి.
4) ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకోని ఒక ముక్కమీద వేయించిన బంగాళా దుంప మిశ్రమం పెట్టి బ్రెడ్ పై పరిచి ఫైన మరో బ్రెడ్ ముక్క పెట్టాలి.ఇలా అన్ని రెడీ చేసుకోవాలి.
5) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి.
6) నూనె కాగాక తయారు చేసిన బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకోని మైదా లో ముంచి కాగే నూనెలో బజ్జిలా వేసి దోరగా వేయించాలి.
7) వీటిని ఒక ప్లేటులోకి తీసుకోని ఒక్కొక్క బజ్జిని క్రాస్ గా కట్ చేసిఉల్లి చక్రాలు తో అలంకరించి సర్వ్ చెయ్యాలి.