దొండకాయ కొబ్బరి కూర (Tindora Coconut in Telugu Dondakaya Kobbari Koora)

కావలసిన పదార్దాలు :


దొండకాయలు : పావు కిలో 
కొబ్బరితురుము (కోరు) : 1 కప్పు 
పచ్చిమిర్చి : నాలుగు
ఉల్లిపాయలు : రెండు
ఆవాలు : 1 టీ స్పూన్
ఎండు మిర్చి : రెండు 
వెల్లుల్లి రేకలు : ఐదు 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
నూనె : 2 టేబుల్ స్పూన్లు 
పసుపు : చిటికెడు 
కొత్తిమీర : కొద్దిగా 
కరివేపాకు : రెండు రెమ్మలు 


తయారుచేయు విధానం :


1) దొండకాయలు కడిగి ముక్కలుగా కట్ చెయ్యాలి. అలాగే ఉల్లి, పచ్చిమిర్చికూడా ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి.
3) తరువాత ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేగాక, దొండకాయ ముక్కలు వేసి మూతపెట్టాలి.
4) అప్పుడప్పుడు కలుపుతూ వుంటే పదినిముషాలకు దొండ ముక్కలు నూనెలో మగ్గి మెత్తగా వుడుకుతాయి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఒకనిముషం ఆగి కొబ్బరితురుము వేసి రెండునిముషాలు కలపాలి.
కొబ్బరి కోరు, దొండముక్కలు బాగా కలిసాక కొత్తిమీర జల్లి స్టవ్ ఆపాలి.

South Indian and Especially Andhra Food Cooking Process in Telugu Language for our Telugu people around the world. | Telugu Vantalu in Telugu | Telugulo Vantalu | Andhra Recipes in Telugu | Cooking in Telugu language | Traditional Telugu Vantalu | Vegetarian Recipes | Non-Vegetarian Food and more....,