పాలు : అరలీటరు
షుగర్ : ఐదు టేబుల్ స్పూన్లు
డ్రయి ఫ్రూట్స్ : కప్పు
బియ్యపిండి : రెండు టేబుల్ స్పూన్లు
కండెన్స్ మిల్క్ : పావు కప్పు
స్ట్రాబెర్రి ముక్కలు : కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి పాలు మరగబెట్టాలి. బియ్యం నానబెట్టి నీళ్ళు వంచి మిక్సిలో పొడిగా పిండిలా చేయాలి.
2) మరుగుతున్న పాలల్లో షుగర్ వేసి కలుపుతూ ఉండాలి. బియ్యపిండి వేసి కలుపుతుఉంటే చిక్కబడుతూ ఉండగా కట్ చేసిన డ్రయి ఫ్రూట్స్ వేసి కాసేపు కలిపి చిక్కపడిన తరువాత స్టవ్ ఆపాలి.
3) ఇప్పుడు కండెన్స్డ్డ్ మిల్క్ వేసి కలిపి చల్లార నివ్వాలి. చల్లారిన తరువాత స్ట్రాబెర్రి ముక్కలు వేసి కలిపి, అరగంట ఫ్రిజ్ లో పెట్టాలి. అరగంట తరువాత చల్లచల్లని ఫిర్ని సర్వ్ చేయండి. అంతే స్ట్రాబెర్రి ఫిర్ని రెడీ.