రాడిష్ దుంపలు : రెండు
వెల్లుల్లి రేకలు : ఆరు
పసుపు : పావు టీ స్పూన్
మిరియాల పొడి : చిటికెడు
వెన్న : రెండు టీ స్పూన్లు
ఉప్పు : సరిపడ
కార్న్ ఫ్లోర్ : అర టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) రాడిష్ దుంపలు, వెల్లుల్లి రేకలు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
2) స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వెన్న వేడి చెయ్యాలి. వెన్న కరిగిన తరువాత వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. దీనిలో రాడిష్ ముక్కలు, పసుపు వేసి రెండు నిముషాలు వేయించి ఐదు కప్పుల నీళ్ళు పోసి మూతపెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి.
3) ఇప్పుడు వీటిని దించి వడకట్టి ముక్కలు వేరేగా ఉంచాలి. ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టి వేరే చిన్న కప్పులో కొద్దిగా నీళ్ళు తీసుకొని కార్న్ ఫ్లొర్ వేసి ఉండలు లేకుండా కలిపి ఈ సూప్ లో వేసి రెండు నిముషాలు మరిగించి
ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి స్టవ్ ఆపాలి.
ఈ సూప్ తాగేముందు వుడికించిన రాడిష్ ముక్కలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.