కావలసిన పదార్దాలు :
చిక్కుడు గింజలు : కప్పు (బీన్స్ )
కొబ్బరి తురుము : అర కప్పు
జీలకర్ర పొడి : అర టీ స్పున్
ధనియాల పొడి : అర టీ స్పూన్
పల్లీలు, పుట్నాలు కలిపి చేసిన పొడి : టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : పావు టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
కొత్తిమీర : కొద్దిగా
కరివేపాకు : రెండు రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్టు : అర టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) చుక్కుడు గింజలు కడిగి పక్కన ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి.
3) తరువాత ఉల్లి, మిర్చిముక్కలు వేసి వేగాక అల్లం-వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి చుక్కుడు గింజలు వేసి మూతపెట్టాలి.
4) అప్పుడప్పుడు కలుపుతూ వుంటే పదినిముషాలకు చుక్కుడు గింజలు నూనెలో మగ్గి మెత్తగా వుడుకుతాయి.ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఒక నిముషం ఆగి కొబ్బరితురుము వేసి రెండునిముషాలు కలపాలి.
5) కొబ్బరి కోరు, చుక్కుడుగింజలు బాగా కలిసాక గరంమసాల, కొత్తిమీర జల్లి స్టవ్ ఆపాలి.