కాకినాడ గొట్టం కాజా (Kakinada Gottam Kaja)

కాకినాడ గొట్టం కాజా

కావలసిన పదార్దములు :

మైదా : పావుకేజీ 
రవ్వ : రెండు టేబుల్ స్పూన్లు 
నెయ్యి : రెండు  టేబుల్ స్పూన్లు 
వంటసోడా : అర టీ స్పూన్ 
పంచదార : అర కేజీ 
నూనె : అర కేజీ 
ఉప్పు : చిటికెడు 

తయారుచేయు విధానం :

1) మైదా జల్లించి దానిలో ఉప్పు, కరిగించిన నెయ్యి, వంటసోడా, రవ్వ వేసి కొద్దిగా నీళ్ళు పోసి ముద్దలా కలపాలి. (మరీగట్టిగ కలపగూడదు) దీనిని గంట పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి పంచదార లో కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి. లేత పాకం రాగానే స్టవ్ ఆపాలి. 
3) వేరే స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగేలోపు మైదా ముద్దను ఒక పీటమీద పొడవుగా చెయ్యాలి.
4) దీనిని చిన్నచిన్న ముక్కలుగా చేసి బొటన వేలుతో చిన్నగా నొక్కి కాగే నూనెలో వేసి మీడియం మంటమీద వేగనివ్వాలి. ఇవి చక్కగా వేగి ఉబ్బుతాయి.
5) ఇవి వేగగానే తీసి పంచదార పాకంలో మునిగేలా కాసేపు అబకతో(జార) నొక్కి ఉంచాలి. అలా చేస్తే కాజాలు పాకం పీల్చుకుంటాయి.కాజా లోపల పాకం ఉండి తినేటప్పుడు చాల బాగుంటాయి. 


* అంతే ఎంతో రుచిగా ఉండే కాకినాడ గొట్టం కాజా రెడీ.