డబుల్ కా మీటా (Double Ka Meetha in telugu Hyderabad Sweet Bread)

డబుల్ కా మీటా


కావలసిన పదార్దములు :


బ్రెడ్ పేకెట్ : ఒకటి 
పాలు : లీటరు 
పంచదార : ముప్పావు కిలో
కోవా : రెండు వందల గ్రాములు 
నెయ్యి : పావుకిలో 
జీడిపప్పు, బాదం, సారపప్పు, 
పిస్తా పప్పు : అన్ని కలిపి 1 కప్పు 
యాలుకలపొడి : 1 టీ స్పూన్ 


తయారు చేయు విధానం :


1) బ్రెడ్ ముక్కలు నేతిలో వేపి పక్కన పెట్టాలి. అలాగే పప్పులు నేతిలో వేయించి తీయాలి.
 2) ఇప్పుడు స్టవ్ పై పాలు పెట్టి మరగనివ్వాలి. పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి గట్టి పాకం రానివ్వాలి.
3) పాకం వచ్చాక  కాచిన పాలు, కోవా వేసి బాగా కలిపి యాలకుల పొడి, నేతిలో వేపిన బ్రెడ్ ముక్కలు వేసి ఒకనిముషం వుంచి స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు నేతిలో వేపిన జీడిపప్పుల మిశ్రమం జల్లి సర్వ్ చేయటమే.