రాగిపిండి దోశ (Raagipindi Dosa)

వంటపేరు : రాగిపిండి దోశ


కావలసిన పదార్ధాలు :


మినపప్పు : కప్పు 
బియ్యం : కప్పు 
రాగిపిండి : కప్పు 
పచ్చిమిర్చి : రెండు 
ఉల్లిపాయలు : రెండు 
జీలకర్ర : టేబుల్ స్పూన్ 
అల్లం : చిన్న ముక్క  
ఉప్పు : సరిపడ
నూనె : సరిపడ


తయారుచేయు విధానం :


1) మినపప్పును, బియ్యాన్ని ఒక రోజు ముందు విడి విడిగా నానబెట్టాలి.
2) మినపప్పును కడిగి,  బియ్యం మినపప్పు కలిపి మెత్తగా రుబ్బాలి. 
3) రుబ్బిన పిండిలో రాగి పిండి, ఉప్పు కలిపి నాలుగు గంటలు పక్కన 
     పెట్టాలి.
4) దోశ వెయ్యటానికి పిండి రెడి అవుతుంది.
5) ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ  
     పిండిలో కలిపి దోశలు వేసుకోవచ్చు.
6) లేదంటే విడిగా ఉంచి, దోశ వేసి ఉల్లి, మిర్చి, అల్లం,  జీలకర్ర దోశ మీద 
     జల్లుకోవచ్చు. 


* అల్లం పచ్చడి లేదా కొబ్బరి పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.