జోన్నరవ్వ లడ్డూలు (Cornflour Laddu in telugu Jonna Ravva Laddoolu)

వంటపేరు - జొన్నరవ్వలడ్డూలు 


కావలసిన పదార్దములు :


జొన్నలు : రెండు కప్పులు
పంచదార : రెండు కప్పులు
నెయ్యి : రెండు కప్పులు
కొబ్బరిపొడి : కప్పు
ఎండు ద్రాక్షా, జీడిపప్పులు : అర కప్పు
పాలు : అర కప్పు
యాలుకలపొడి : టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) జొన్నలు సన్నని రవ్వలా మరపట్టించాలి
2) స్టవ్ ఫై నెయ్యి వేడి చేసి జీడిపప్పులు, ఎండు ద్రాక్షా, కొబ్బరిపొడి వేసి 
    దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
3) అదే కళాయిలో మరి కాస్త నెయ్యి వేసి జోన్నరవ్వను బంగారు రంగులోకి 
    వచ్చే వరకు వేపి, కొబ్బరిమిశ్రమం వేసిన ప్లేటులోకి తీసుకోవాలి.
4) పంచదారను జోన్నరవ్వ మిశ్రమంలో వేసి యాలుకల పోడి వేసి బాగా 
    కలపాలి. 
5) ఇప్పుడు పాలు, మిగిలిన నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలిపి, ఉండలు 
    చుట్టుకోవాలి.


* అంతే జోన్నరవ్వఉండలు రెడీ.