కావలసిన పదార్ధాలు :
బొంబాయి రవ్వ : కప్పు
మైదా : కప్పు
బియ్యప్పిండి : కప్పు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర : టీ స్పూన్
ఉల్లి ముక్కలు : పావుకప్పు
పచ్చిమిర్చిముక్కలు : టేబుల్ స్పూన్
కట్ చేసిన కొత్తిమిర : టేబుల్ స్పూన్
అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
పెరుగు : కప్పు
తయారుచేయు విధానం :
1) ఒక గిన్నెలో రవ్వ, మైదా, బియ్యపుపిండి, కొద్దిగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. దీనిలో ఉప్పు, పెరుగు కుడా వేసి కలిపి రెండు గంటలు పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి రేకుపెట్టి కలిపిన పిండిని దోసేలా వేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమిర వేసి నూనె రెండు ప్రక్కలా దోరగా కాల్చాలి.
Post a Comment