పుదినా పచ్చడి (Pudeena Chutney)

వంటపేరు : పుదినా పచ్చడి


కావలసిన పదార్ధాలు :


పచ్చిమిర్చి : పది
పుదినా : కట్ట
కొద్దిగా : చింతపండు
ఉప్పు : సరిపడా 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పోపుదినుసులు : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
వెల్లుల్లి : రెండు రెబ్బలు


తయారుచేయు విధానం :


1) పచ్చిమిర్చి నూనెలో వేపాలి.
2) అలాగే పుదినా కూడా వేపాలి.
3) ఇప్పుడు మిక్సిజార్లో మిర్చి, పుదినా, ఉప్పు, చింతపండు వేసి ఒకసారి 
    మిక్స్ చెయ్యాలి.
4) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు, కరివేపాకు, జీలకర్ర వేసి వేగాక, 
    రెడీగావున్న పచ్చడి వేసి పోపులో కలపాలి.


* అంతే పుదినా పచ్చడి రెడి.