కేప్సికం పెరుగు పచ్చడి (Capsicum perugu pachhadi)

వంటపేరు : కేప్సికం పెరుగు పచ్చడి

కావలసిన పదార్ధాలు :


పెరుగు : మూడు కప్పులు 
కేప్సికం ముక్కలు : కప్పు                            
ఉప్పు : సరిపడా 
పచ్చిమిర్చి : ఒకటి 
నూనె : టేబుల్ స్పూన్ 
పోపుదినుసులు : టేబుల్ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
కరివేపాకు : కొద్దిగా 
కొత్తిమిర : కొద్దిగా 
దోసకాయ ముక్కలు : కప్పు 


తయారుచేయు విధానం :


1) కేప్సికం చిన్నగా కట్ చేసి నూనెలో కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 
    కేప్సికం ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, టమాటా   
    ముక్కలు, కొత్తిమిర, ఉల్లిముక్కలు, ఉప్పు అన్నీ పెరుగులో వేసి కలపాలి.
2) ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు, కరివేపాకు, ఎండిమిర్చి, 
    పసుపు వేసి వేగాక, ఈ తాలింపును పెరుగు పచ్చడిలో వేసి కలపాలి.


* అంతే కాప్సికం పెరుగుపచ్చడి రెడి.