బేబి ఆలూ కర్రి (Baby potato curry in telugu Chinna Bangaladumpala koora)


వంటపేరు : బేబి ఆలూ కర్రి


కావలసిన పదార్దములు :


చిన్నబంగాళదుంపలు : అర కిలో
పెరుగు : పావుకిలో
చాట్ మషాల : 1 టేబుల్ స్పూన్
గరం మషాల : 1 టీ స్పూన్
కారం :1 టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్
వెన్న: 1 టేబుల్ స్పూన్


తయారుచేయు విధానం :


1) స్టవ్ పై కుక్కర్ పెట్టి దానిలో గ్లాస్ నీళ్ళు, చిన్న బంగాళదుంపలు వేసి 
    మూతపెట్టి ఉడకనివ్వాలి.
2) ఒక విజిల్ రాగానే స్టవ్ ఆపాలి.
3) ఇవి చల్లారిన తరువాత పొట్టుతీసి ఫోర్క్ తో అక్కడక్కడా గాట్లు పెట్టి 
    నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలిపి పది నిముషాలు పక్కన వుంచాలి.
4) ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, చాట్ మషాల, గరం మషాల, ఉప్పు, కారం 
    వేసి బాగా కలపాలి.
5) ఇప్పుడు పక్కన పెట్టిన బంగాళాదుంపలు పెరుగులో వేసి కలపాలి.
6) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పెరుగు మిశ్రమం వేసి చిన్న మంటమీద 
    కలుపుతూ వుండాలి.
7) పది నిముషాలకు పెరుగు మొత్తం యిగిరిపోయి పొడిపొడిగా అవుతుంది.
8) ఇప్పుడు వెన్న వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి.


* ఎంతో రుచిగా ఉండే బేబి ఆలూ కర్రి రెడి.