Showing posts with label vadiyalu. Show all posts

మినప వడియాలు 
కావలసిన పదార్దములు 


మినపప్పు అరకేజి 
జీలకర్ర - టేబుల్ స్పూన్ 
అల్లం - చిన్నముక్క 
ఉప్పు - సరిపడా 
పచ్చిమిర్చి - ఐదు 




తయారుచేయు విధానం 


1) ముందురోజురాత్రి మినపప్పును నానబెట్టాలి.ఉదయాన్నేకడిగి అల్లం,పచ్చిమిర్చికలిపి మెత్తగా గట్టిగా రుబ్బాలి.
2) రుబ్బిన పిండికి ఉప్పు,జీలకర్ర కలిపాలి.ఒక క్లాత్ ఫై చిన్నచిన్నగా వడియాలు పెట్టాలి.{ఉసిరికాయంత}
3) బాగా ఆరిన తరువాత ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.  


కావలసిన పదార్దాలు:

సగ్గు బియ్యం  : రెండుకప్పులు
ఉప్పు : సరిపడా
జీలకర్ర : పావుకప్పు
నీళ్ళు : పన్నెండు కప్పులు
పచ్చిమిర్చి పేస్టు : పావుకప్పు

తయారు చేయు విధానం:

1) పది కప్పుల నీళ్ళు స్టవ్ మీద పెట్టి మరగ నివ్వాలి. దీనిలో జీలకర్ర,ఉప్పు,పచ్చిమిర్చి పేస్టు వేయాలి.

2) నాలుగు కప్పుల నీళ్ళతో సగ్గు బియ్యం నానబెట్టాలి. ఇప్పుడు మరుగు తున్ననీటిలో వేసి వుడకనివ్వాలి.

3)ఉడికి చిక్కబడిన తరువాత స్టవ్ ఆపాలి. దీనిని కొద్దిగా చల్లారనిచ్చి ఒకప్లాస్టిక్ కవరు మీద లేదా  క్లాత్ మీద గరిటతో కొద్ది,కొద్దిగా వడియాలుగా వేసి ఎండలో బాగా ఆరనిచ్చి తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

ఇవి నూనెలో వేపుకోవాలి..

Powered by Blogger.