కొబ్బరి తురుము : రెండు కప్పులు
పంచదార : రెండు కప్పులు
నెయ్యి : పావుకప్పు
యాలుకలపొడి : టీ స్పూన్
జీడిపప్పులు : పది
టమాటాలు : ఐదు
తయారుచేయు విధానం :
1) వేడి నీటిలో టమాటాలు వేసి పది నిముషాలు ఉంచి ఫైన (పొర) వలిచి మిక్సి పట్టాలి.
2) గుజ్జులా వస్తుంది.దీనిని వడ కడితే రసం వస్తుంది. 3) స్టవ్ వెలిగించి టమాటా రసం, పంచదార కలిపి మరిగించాలి.
4) పంచదార కరిగి రసం చిక్క బడ్డాక దానిలో కొబ్బరి తురుము వేసి కలుపుతుంటే మరింత చిక్కగా దగ్గర పడుతుంది.
5) ఇప్పుడు దీనిలో యాలుకుల పొడి, నెయ్యి వేసి కలపాలి .
6) దీనిని నెయ్యి రాసిన ప్లేటులోకి వేసి సమంగా చేసి వేయించిన జీడి పప్పులు దీనిమీద అద్దాలి.
7) చల్లారక ముక్కలుగా కట్ చెయ్యాలి.అంతే పుల్లగా తియ్యగా ఉండే కొబ్బరి అచ్చులు రెడీ.