పాలకూర రొట్టె (Palak Bread in telugu Palakura Rotte)

కావలసిన పదార్ధాలు :


పాలకూర కట్టలు : రెండు 
కొత్తిమీర కట్టలు : రెండు 
సెనగపిండి : కప్పున్నర 
బియ్యపిండి : అర కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
పచ్చిమిర్చిపేస్టు : టీ స్పూన్ 
ఉప్పు : రుచికి తగినంత 
నూనె : అర కప్పు 
జీలకర్ర : అర టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) పాలకూర, కొత్తిమీర  శుబ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కనపెట్టాలి.  
2) బియ్యపిండి, సెనగపిండి, పసుపు, ఉప్పు వేసి నీళ్ళుపోసి జారుగా కలిపి పక్కనపెట్టాలి.
3) స్టవ్ ఫై మందపాటి గిన్నెపెట్టి నూనె వేడిచేసి జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చిపేస్టు వేసి వేయించాలి.
4) తరువాత పాలకూరతురుము, కొత్తిమీరతురుము వేసి కాసేపు వేయించి  కలిపినపిండి కూడా వేసి ఒక ఐదునిముషాలు వుడికించి దించాలి.
5) ఇప్పుడు స్టవ్ ఫై పాన్ పెట్టి నూనెవేసి కాగాక వుడికిన ఈ పిండిమిశ్రమాన్ని రొట్టెలా వేసి చిన్నమంటమీద రెండు వైపులా ఎర్రగా కాలనిచ్చి దించాలి. మనకు కావలసిన షేపులో కట్ చేసుకోవచ్చు.