గోధుమ బిస్కెట్ లడ్డు (Wheat Biscuit Laddu in Telugu)

కావలసిన పదార్దాలు :


గోధుమలు : కప్పు 
బిస్కెట్ పెకిట్ : ఒకటి (మీకిష్టం అయ్యినది)
పంచదార : టేబుల్ స్పూన్ 
వెన్న : టేబుల్ స్పూన్ 
కండెన్స్డ్ మిల్క్ : అర కప్పు 
కోకో పొడి : రెండు టేబుల్ స్పూన్లు 


తయారుచేయు విధానం :


1) గోధుమలు దోరగా వేయించి మిక్సిలో పొడి చేసి వుంచాలి. అలాగే బిస్కెట్స్ ను కూడా మిక్సిలో పొడి చేసి వుంచాలి. అలాగే పంచదారను పొడిచేసి వుంచాలి. 
2) ఇప్పుడు ఈ మూడు పొడులు, కోకోపొడి కలిపాలి. దీనికి కండెన్స్డ్ మిల్క్, కరిగించిన వెన్న కలిపి ఉండలు చేసుకోవాలి.
అంతే గోధుమ బిస్కెట్ లడ్డు రెడీ.