శెనగ ట్టిక్కి (Senaga Tikki in Telugu)


కావలసిన పదార్దములు


శెనగపప్పు - రెండు కప్పులు
పచ్చిమిర్చిముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తురుము - 3 టేబుల్ స్పూన్లు
కారం - అర టీ స్పూన్
ఉప్పు - సరిపడా
చాట్ మసాలా - పావు టీ స్పూన్
గరం మసాలా - పావు టీ స్పూన్
అల్లం ముక్కలు - టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లొర్ - రెండు టీ స్పూన్లు
బ్రెడ్ పొడి - నాలుగు టేబుల్ స్పూన్లు
నూనె - వేయించటానికి సరిపడా  


తయారు చేయు విధానం :


1) శెనగ పప్పును అరగంట నీళ్ళల్లో నానబెట్టాలి. తరువాత మెత్తగా వుడికించాలి. నీళ్ళు వంచి మెత్తగా చిదమాలి.
2) దీనిలో ఫైన చెప్పిన పదార్దాల్లన్నికలిపి కట్లెట్ మాదిరి బిస్కేట్ లా గుండ్రంగా కాస్త మందంగా చేయాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడిచేసి కాగాక, వీటిని బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ పరిచిన ప్లేటు లోకి తీసుకోవాలి. వీటిలో నూనెను పేపర్ పిల్చుకున్నాక వేరే ప్లేటులోకి తీసి సర్వ్ చెయ్యాలి.