కావలసిన పదార్దాలు :
బ్రెడ్ పేకెట్ : ఒకటి
పాలు : కప్పు
పనీర్ : అర కప్పు
ఫ్రెష్ క్రీం : అర కప్పు
కండెన్స్డ్ మిల్క్ : అరకప్పు
జీడిపప్పు, బాదం : పావుకప్పు
పంచదార : రెండు కప్పులు
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) బ్రెడ్ స్లయిసేస్ని ఒకొక్క దానిని తీసుకుని మధ్యకు గుండ్రంగా కట్ చెయ్యాలి. స్టవ్ మీద నూనె పెట్టి వేడి చెయ్యాలి. వీటిని నూనె లో వేసి దోరగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.
2) పంచదార లో నీళ్ళు వేసి తీగపాకం పట్టాలి. పాకం వచ్చాక వేయించిన బ్రెడ్ ముక్కలు పాకం లో వేసి ఐదు నిముషాలు వుంచితే పాకం పీల్చుకుంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
3) ఇప్పుడు స్టవ్ ఫై గిన్నెపెట్టి పాలు రెండునిముషాలు మరిగించాలి. వీటిలో పన్నీర్ తురుము వేసి రెండు నిముషాలు వుడికిన తరువాత కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీం వేసి కలుపుతూ దగ్గరకు అయ్యే వరకు వుడికించి దించేముందు యాలుకుల పొడి వేసి దించాలి. ఇవన్ని కలిసి కలాకండ్ లా వుంటుంది.
4) దీనిని స్పూన్ తో కొంచెంకొంచెం తీసుకోని బ్రెడ్ ముక్కల మీద పరవాలి. దీనిమీద జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు వేసి పది నిముషాలు ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చెయ్యాలి.