మటన్ కొత్తిమీర కర్రి (Mutton Kothhimira Curry)

వంటపేరు : మటన్ కొత్తిమీర కర్రి 


కావలసిన పదార్దములు :


మటన్ : అర కిలో 
కొత్తిమీర : పావుకిలో 
పచ్చిమిర్చి : ఎనిమిది
వెల్లుల్లి : ఐదు
దాల్చిన చెక్క : చిన్న ముక్క 
యలుకులు : రెండు 
లవంగాలు : మూడు 
పసుపు : చిటికెడు 
ఉప్పు : సరిపడా 
కారం : పావు టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
పలావు ఆకులు : రెండు 
నిమ్మరసం : టేబుల్ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) కొత్తిమీర శుబ్రంగా కడిగి పచ్చిమిర్చితో కలిపి మెత్తగా నూరాలి.
2) మటన్ ముక్కలు శుబ్రంగా కడిగి ఉప్పు, నూరిన కొత్తిమీర ముద్దను పట్టించి గంటన్నర నాననివ్వాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె వేడి చెయ్యాలి. చిదిమిన వెల్లుల్లి, చెక్క, యాలకులు, లవంగాలు, పసుపు, పలావు ఆకు వేసి వేగిన తరువాత మటన్ వేసి పది నిముషాలు వేపాలి.
4) ఇప్పుడు కారం వేసి కలిపి, కొద్దిగా నీళ్ళుపోసి మూత పెట్టాలి.
5) నాలుగు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపాలి. ఆవిరి తగ్గాక మూతతీసి నిమ్మరసం  పిండి వడ్డించాలి.

* అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ కొత్తిమీర కర్రి రెడి.